01/14/19 5:49 PM

హీరో ప్రభాస్‌తో అఫైర్ గురించి ఓపెన్ అయిపోయిన షర్మిల

YS Sharmila Reacts On Relation With Hero Prabhas

భోగి పండుగ వేళ రాజకీయ మంటలు పుట్టించారు వైసీపీ అధినేత జగన్ సోదరి వైఎస్ షర్మిల. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న షర్మిల ఆ విషయంలో ఇవాళ ఓపెన్ అయిపోయారు. బాహుబలి ప్రభాస్‌తో నాకు అఫైర్ అంటగడతారా? అంటూ నిప్పులు చెరిగారు. తనకు ప్రభాస్‌తో సంబంధం ఉందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై షర్మిల తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని షర్మిల హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన గురించి అసత్య ప్రచారం చేస్తున్న వారిని, వారి వెనకున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు.

 

షర్మిల ఈ రోజు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌‌ను కలిశారు. తనకు, ప్రభాస్‌కు రిలేషన్ ఉందని చెబుతూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారనే విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లారు. వారిపై చర్యలు తీసుకోవాలని సీపీని కోరారు. షర్మిళ వెంట ఆమె భర్త బ్రదర్ అనిల్‌కుమార్, వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు ఉన్నారు.

 

నా జీవితంలో ప్రభాస్‌ని కలవలేదు:
పోలీసులతో మాట్లాడిన తర్వాత మీడియా ముందుకు వచ్చిన షర్మిల.. ప్రభాస్ అనే వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన జీవితంలో ఎన్నడూ ప్రభాస్‌ను కలవలేదని, అసలు చూడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదని తేల్చి చెప్పారు. ”నాకు, ప్రభాస్ అనే ఒక మూవీ స్టార్‌కు సంబంధం ఉందని దుష్ప్రచారం చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఒక క్యాంపెయిన్‌లాగా ఒక వర్గం నడిపింది. ఏ ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధం ఉంది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారో… ఆ వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి, నాకు ఏ సంబంధమూ లేదు. ఇది నిజం. ఇదే నిజమని నా పిల్లల మీద ప్రమాణం చేసి మరీ చెబుతున్నా” అని షర్మిల అన్నారు.

 

దుష్ప్రచారం వెనుక బాబు కుట్ర:
ఈ ప్రచారం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని షర్మిల అనుమానం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారం వెనుక సీఎం చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేకనే హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల తెలిపారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇలానే దుష్ప్రచారం చేశారని, అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ చేసి, చర్యలు తీసుకోవడంతో కొంతకాలం ఈ దుష్ప్రచారం ఆగిందన్నారు. మళ్లీ ఎన్నికల సమయం వచ్చే సరికి విష ప్రచారానికి మళ్లీ వేగం పెంచారని షర్మిల మండిపడ్డారు. స్త్రీల పట్ల ఇంత శాడిజం, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను, దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా? అని షర్మిల ప్రశ్నించారు

 

జగనన్నను దెబ్బకొట్టేందుకే:
రాజకీయంగా తనను, తన అన్న వైఎస్ జగన్‌ను, ఆయన కుటుంబాన్ని అణగదొక్కాలని చూస్తున్న కొన్ని రాజకీయ శక్తులు సోషల్ మీడియాలో అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని షర్మిల ఆరోపంచారు. తనపై, తన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయనకు అందించానని, ఆయన సానుకూలంగా స్పందించి, విచారణ జరిపిస్తానని మాటిచ్చారని అన్నారు.

 

ఇదే నిజమనుకునే ప్రమాదముంది:
తాను ఒక దోషిలా నిలబడి, తన వాదన వినిపించుకోవాల్సిన దుస్థితి రావడం తనకే కాదు మహిళలందరికీ అవమానకరం అని షర్మిల వాపోయారు. ”ఐదేళ్ల కింద ఎప్పుడో మొదలైంది. ఇప్పుడు మళ్లీ తలెత్తింది. మళ్లీ మళ్లీ కూడా తలెత్తవచ్చు. నేను మాట్లాడకపోతే, ఇదే నిజమని కొంతమందైనా అనుకునే ప్రమాదముంది. కనుక, ఈ తరహా తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించడానికి, ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా, మీడియా ముందుకు రావడం జరిగింది” అని షర్మిల భావోద్వేగానికి గురయ్యారు. “నేను ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా, నా నైతికతను, నా నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, నా గురించి నాకు తెలుసు. నా దేవుడికి కూడా నా గురించి తెలుసు. కానీ, ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకుంది. అందుకే మీ అందరి ముందుకు వచ్చి చెబుతున్నా” అని షర్మిల అన్నారు.

 

చంద్రబాబు ఇంట్లో ఆడోళ్లు లేరా?
రాజకీయాల కోసం మరీ ఇంత నీచానికి దిగజారిపోతారా? అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారం వెనుక టీడీపీ హస్తం ఉందన్న షర్మిల, పుకార్లు పుట్టించడం టీడీపీకి కొత్త కాదన్నారు. అబద్దాన్ని వందసార్లు చెప్పి నిజం చేయడం టీడీపీ సిద్ధాంతమన్నారు. చంద్రబాబు డిక్షనరీలో విలువలు, నైతికత అనే పదాలు లేన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అంటూ డైలాగులు చెప్పే టీడీపీ నేతలకు ఆత్మగౌరవం ఉందో లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా, మేం దుష్ప్రచారం చేయలేమా, మాకు ఆ తెలివి లేదా, కానీ మాకు విలువలు ఉన్నాయి కాబట్టి ఆ పని చేయడం లేదన్నారు. ఇది తన వ్యక్తిగత విషయంగా చూడకుండా మహిళల ఆత్మగౌరవంగా చూడాలని సీపీని కోరినట్లు షర్మిల చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారన్నారు.

 

షర్మిల, ప్రభాస్‌కు మధ్య అఫైర్ ఉందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అది ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ ఈ వ్యవహారం తీవ్ర దుమరాం రేపింది. ప్రభాస్‌ను తన జీవితంలో కలవలేదు అని పిల్లల మీద ప్రమాణం చేసి మరీ షర్మిల చెప్పడం విశేషం. షర్మిల ఇంత ఓపెన్‌గా చెప్పాకైనా.. ఈ ప్రచారానికి తెరపడుతుందో లేదో చూడాలి.

Tags : no relation with prabhasprabhas sharmila affairsharmila complaint cpsocial mediays jagan mohan reddy sisterYS Sharmilays sharmila bahubali prabhas

Also read

Use Facebook to Comment on this PostMenu