11/11/18 12:10 PM

అంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఏకైక నేత వైఎస్ మాత్రమే – విజయమ్మ

ys vijayamma fires on chandrababu

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ స్పందించారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన విజయమ్మ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబుకి, తన భర్త వైఎస్‌కి మధ్య ఉన్న తేడా ఏంటో వివరించారు. నాడు అలిపిరిలో చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగిన వేళ, తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వెళ్లి, చంద్రబాబును ఓదార్చాడని గుర్తు చేసుకున్న విజయమ్మ, నేడు అదే పనిని చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అప్పట్లో ఆసుపత్రిలో ఉన్న చంద్రబాబు వద్దకు వెళ్లి, కౌగిలించుకుని “దేవుడు గొప్పవాడు బాబూ… దేవుడి దయవల్ల రక్షించబడ్డావు అని చెప్పి ఓదార్చారు. గాంధీ విగ్రహం వద్ద కూర్చుని ధర్నా కూడా చేసిన సంస్కృతి ఆయనది. మరి ఈయన సంస్కృతి ఏంటి? ఇదేనా సుదీర్ఘ రాజకీయ అనుభవం?” అని విజయమ్మ నిలదీశారు. జగన్ పై హత్యాయత్నం జరిగిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా కనీసం పరామర్శించాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉన్నా ఆయన ఆ పని చేయలేదని మండిపడ్డారు.

 

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న వేళ, పరిటాల రవి హత్య జరిగితే, తన బిడ్డ జగన్‌పై ఆరోపణలు చేస్తూ, చంద్రబాబు నానాయాగీ చేశారని, ఆ సమయంలో నిజాన్ని నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతో హత్యపై విచారణను సీబీఐకి అప్పగించారని విజయమ్మ గుర్తు చేశారు. కన్న కొడుకుపై ఆరోపణలు వస్తే, సీబీఐ విచారణకు ఆదేశించిన మహానేత వైఎస్ అని కొనియాడారు. కొడుకుపై సీబీఐ విచారణకు ఆదేశించిన ఏకైక నేత కూడా ఆయనేనని అన్నారు. ఆ నేత బిడ్డగా నేడు ప్రజల ముందున్న జగన్‌ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు.

 

నేడు జగన్‌పై హత్యాయత్నం విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తుంటే, టీడీపీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని విజయమ్మ ప్రశ్నించారు. రోజుకో అబద్ధపు ప్లెక్సీలు సృష్టించి, కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిందితుడు నిజంగా జగన్ అభిమాని అయితే, నాలుగు నెలలుగా ప్రతివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తున్న జగన్‌ను అతను ఎందుకు కలవలేదని అడిగారు. అభిమాని అయితే గొంతుకు కత్తి ఎలా పెడతాడని ప్రశ్నించారు. నిజంగా అభిమాని అయినా, విచారణ జరిపించాల్సిన అవసరం చంద్రబాబుకు లేదా? అని మండిపడ్డారు.

Tags : alipiri incidentchandrababu naidujagan padayatramurder attempt on jaganparitala raviTDPYS Vijayammays vijayamma over attack on jaganysr

Also read

Use Facebook to Comment on this Post



Menu