08/12/18 8:24 PM

వైఎస్ భారతి పేరు వెనుక చంద్రబాబు కుట్ర ఉంది-అంబటి రాంబాబు

Untitled-1 copy

జగన్ ఆస్తుల కేసులో వైఎస్ భారతి పేరుని ఈడీ తన చార్జ్ షీటులో నిందితురాలిగా చేర్చిందని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. ఈడీ లో కొందరు అధికారులు సీఎం చంద్రబాబు పెట్టే గడ్డి తింటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఈడీ అధికారుల కాల్ డేటా బయటపెడితే అందరి బాగోతాలు బయట పడతాయన్నారు. నాడు జగన్ జైలులో ఉంటే పార్టీ పని అయిపోయింది అనుకున్నారని, కానీ, అలా జరగకపోవడంతో టీడీపీ నేతలు ఇలా కుట్రలు పన్నుతున్నారని అంబటి ఆరోపించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతోనే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతిపై కేసు నమోదు చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. ఇదంతా కుట్ర అన్న అంబటి.. జగన్, వైఎస్ కుటుంబాన్ని అపహాస్యం చేయడానికి కొన్ని శక్తులు పని చేస్తున్నాయన్నారు. వైఎస్ మృతి తర్వాత ఆయన కుటుంబాన్ని ఇబ్బందిపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో మాకు లాలూచీ ఉంటే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారాయన.

మంత్రులు ఆదినారాయణ రెడ్డి, యనమలపైనా అంబటి ఫైర్ అయ్యారు. ‘మా పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవి సంపాదించిన ఆదినారాయణరెడ్డి మమ్మల్ని విమర్శిస్తున్నారు. అసలు ఆయనకు సిగ్గుందా? తుని ఘటనలో రైలును వైసీపీ గూండాలు తగులబెట్టారంటున్న యనమలకు సిగ్గుందా? అధికారం మీదే కదా ఈ ఘటనపై ఎందుకు విచారణ చేయడం లేదు?’ అని అంబటి ప్రశ్నించారు. తమపై ఎన్ని కుట్రలు, కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు రెడ్ హ్యాండెడ్ గా దొరికితే తప్పుగా కనిపించడం లేదా? అని నిలదీశారు. చంద్రబాబులా వ్యవస్థలను మేనేజ్ చేయడం మాకు రాదు, అందుకే ఇలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

న్యాయ వ్యవస్థ బలమైనదని చెబుతారని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి బెయిల్ తెచ్చుకున్నామని చెబుతారని, ఇదేలా సాధ్యమని అంబటి ప్రశ్నించారు. టీడీపీ తీరు భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. జగన్ రూ.43. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు.

Tags : Ambati rambabiap cm chandrababuEDys bharathiys jaganysrcp

Also read

Use Facebook to Comment on this Post



Menu