06/30/19 8:41 PM

నడిరోడ్డుపై నరికేస్తా.. జర్నలిస్ట్ కి వైసీపీ ఎమ్మెల్యే బెదిరింపులు

YSRCP MLA Warns Journalist

అవినీతి, అక్రమాలకు తావు లేదు. దౌర్జన్యాలు, బెదిరింపులు సహించేది లేదు. తప్పు చేసినవారు ఎవరైనా.. చర్యలు తప్పవు. ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు అయినా, మంత్రులు అయినా.. సరే.. కఠినమైన చర్యలు తప్పవు..శాంతిభద్రతల విషయంలోనూ రాజీ లేదు.. తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా.. తాట తియ్యండి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా ఇచ్చిన వార్నింగ్ ఇది. పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు జగన్ గీత గీశారు. లిమిట్స్ క్రాస్ చేయొద్దని హెచ్చరించారు. ప్రతిపక్షాల సంగతి ఏమో కానీ.. సొంత పార్టీ నేతే జగన్ గీసిన గీతాను క్రాస్ చేశారు. జర్నలిస్ట్ కి వార్నింగ్ ఇచ్చారు. నడిరోడ్డుపై నరికేస్తా అంటూ చిందులు తొక్కారు. ఇప్పుడా ఆ ఎమ్మెల్యే వార్నింగ్ కి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీడీపీ నేత నారా లోకేష్ స్వయంగా ఈ ఆడియో క్లిప్ ని బయటపెట్టారు.

 

వివరాల్లోకి వెళితే.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఓ జర్నలిస్ట్ కి ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. నా గురించి ఏమనుకుంటున్నావ్..జాగ్రత్త.. నడిరోడ్డుపై నరికేస్తా.. అంటూ ఆ జర్నలిస్ట్ ని ఇంటికి పిలిపించుకుని మరీ బూతులు తిట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

 

ఈ ఆడియో క్లిప్ ని సోషల్ మీడియాలో పెట్టిన లోకేష్.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘ఈ రాక్షస రాజ్యంలో జర్నలిస్టుల పరిస్థితి ఇదైతే ఇక సామాన్యుడి పరిస్థితి ఎలా ఉండబోతోందో మీరే ఊహించండి..దయచేసి కుటుంబ సభ్యులతో ఈ అసభ్య పదజాలం వినకండి’ అంటూ ట్వీట్ చేశారు. నాయకుడేమో నీతులు చెబుతారు.. అనుచరులేమో బూతులు తిడతారు.. అని విమర్శలు గుప్పించారు. లోకేష్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఆడియోలో ఉన్న గొంతు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిదా కాదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఆ గొంతు ఎమ్మెల్యేదని తేలితో.. సీఎం జగన్ ఎలా స్పందిస్తారు, ఆ ఎమ్మెల్యేపై ఏవైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

 

కాగా, ఈ ఆరోపణలను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఖండించారు. జర్నలిస్ట్ ని తాను బెదిరించలేదని, బూతులు తిట్టలేదని చెప్పారు. అసలా ఆడియో క్లిప్ వాస్తవం కాదన్నారు. కట్, పేస్ట్ చేసిందన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ వాళ్లే ఇదంతా చేశారని ఆరోపించారు. జర్నలిజం ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తితో తాను మాట్లాడిన మాటలను అక్కడక్కడ కట్ చేసి ఆడియో రిలీజ్ చేశారని శ్రీధర్ రెడ్డి వివరించారు. ఎన్నికలకు ముందు తన కుటుంబంపై సదరు వ్యక్తి దుష్ప్రచారం చేయడం వల్లే… తాను అతడిని మందలించానని చెప్పుకొచ్చారు.

 

కాగా, ఈ వ్యవహారాన్ని జగన్ సీరియస్ గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తప్పు ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు. అలా కనుక చేస్తే.. ప్రజల్లో జగన్ పాలనపై మరింత నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు.

Tags : ap cm ys jaganaudio clipjournalistkotamreddy sridhar reddynara lokeshnellore ruralwarning

Also read

Use Facebook to Comment on this Post



Menu