05/17/19 11:46 AM

ఆ భయంతో జగన్‌ని దూరం పెట్టిన కేసీఆర్

YSRCP Will Close After May 23rd

మే 23 తర్వాత వైసీపీ దుకాణం బంద్ కాబోతోందని ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. లోటస్ పాండ్‌లోని వైసీపీ దుకాణాన్ని కూడా మూసేయమంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి జగన్‌కు ఆదేశాలు వెళ్లాయని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు నీ పాపాలు మోసానని, ఇక తన వల్ల కాదని జగన్‌కు కేసీఆర్ స్పష్టం చేశారని ఉమ అన్నారు. ఎన్నికల ఖర్చుల కోసం రూ.1200 కోట్లు ఖర్చు చేశానని, మునిగిపోయే పడవలాంటి నిన్ను పట్టుకుని ముందుకు వెళ్లడానికి తాను సిద్ధంగా లేనని జగన్‌తో కేసీఆర్ తేల్చి చెప్పారని ఉమ ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం నుంచి తనకు చిక్కులు ఉండకూడదంటే తెలంగాణలో జగన్ తన దుకాణాన్ని మూసేసుకోవాల్సిందేనంటూ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నుంచి జగన్‌కు ఆదేశాలు వెళ్లాయని ఉమ అన్నారు.

 

కేసీఆర్ ఆదేశాలతో జగన్ తన దుకాణాన్ని ఏపీకి మారుస్తున్నారని చెప్పారు. అరాచక శక్తులు ఏపీలో అడుగుపెడుతున్నాయని పోలీసులు, నిఘా వర్గాలు వీరిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని దేవినేని ఉమ కోరారు. మే 23వ తేదీ తర్వాత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారని ఆయన అన్నారు. అంతేకాదు కేంద్రంలో కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని రావడం ఖాయమన్నారు. దేశ ప్రధానిని చంద్రబాబు డిసైడ్ చేస్తారని కూడా చెప్పారు. ఏపీలో మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Tags : ap resultschandrababudevineni umaKCRYs jagan mohan reddyysr congress party

Also read

Use Facebook to Comment on this Post



Menu