11/17/16 5:35 PM

నోట్ల మార్పిడిలో చిన్నలోపంతో తప్పించుకుంటున్న నల్లకుబేరులు!

loop-hole-in-currency-exchange-demonitisation

 

ఎంతో పకడ్బందీగా నోట్ల మార్పిడిని అమలు చేస్తున్నాము అని ప్రభుత్వం చెబుతోంది. కానీ బ్లాక్ మనీని వైట్ లోకి మార్చేందుకు ఇప్పటికే అక్రమార్కులు రంగంలోకి దిగారు. లెక్కల్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి చాలామంది ఆడిటర్లు రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు. 30% ఇస్తే బ్లాక్ ని వైట్ చేస్తామనే ముఠాలు తయారయినట్లుగా పుకార్లు నడుస్తున్నాయి. బ్లాక్ మనీని మార్చుకునేందుకు అడ్డదారులు వెదికే పనిలో అక్రమార్కులు బిజీగా ఉన్నారు. నరేంద్రమోది ప్రభుత్వం చేసిన చిన్నపొరపాటు ఇపుడు పెద్ద రంధ్రంగా మారింది. అదెలా గంటే..

 

ప్రజలంతా తమ దగ్గర ఉన్న పాత 500, 1000 నోట్లను డిసెంబర్ 30లోగా మార్చుకోవాలని ప్రధాని మోది నవంబర్ 8వ తేదీ ప్రకటించారు. అంటే సుమారు 50రోజులు టైం ఇచ్చారు. ఇప్పుడీ 50రోజుల గడువు అక్రమార్కులకి వరంగా మారింది. ఈ 50రోజుల్లో వీలయినంత బ్లాక్ మనీని వైట్ గా మార్చేందుకు బంగారం కొనడం, డాలర్లు కొనడం, బినామీలకి ఇచ్చి మార్పించుకోవడం లాంటివి జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇంత పెద్ద పని చేసిన మోది, ఒకే ఒక్క కండిషన్ పెట్టి ఉంటే ఈ పాటికి నల్లడబ్బు లెక్క తేలేది.

 

నవంబర్ 8న నోట్ల రద్దు/మార్పిడిని ప్రకటించిన మోది, దేశ ప్రజలంతా తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లని లెక్కపెట్టుకుని, వారంరోజుల్లో ఆన్ లైన్ లో లేదా బ్యాంక్ లో, తమపేరు, ఆధార్ నంబర్, పాన్ నంబర్, తమ దగ్గర 500 నోట్లు ఎన్ని ఉన్నాయి, 1000 నోట్లు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి (డిపాజిట్ తర్వాత చేసినా పర్వాలేదు) అని చెప్పాల్సింది. అలా చెబితే ఒక్క వారంలో దేశంలో ఉన్న నగదు వివరాలు అన్నీ RBI కి చేరి ఉండేవి. మానిప్యులేషణ్ చేయడానికి వీలుండేది కాదు.

 

ఇప్పుడు చిన్న వాళ్ళంతా నిజాయితీగా డబ్బు పట్టుకుని బ్యాంకుల ముందు బారులు తీరుతుంటే, పెద్ద చేపలు అక్రమమార్గాల వేటలో బిజీ బిజీగా ఉన్నాయి. దీని వల్ల నోట్ల రద్దు/మార్పిడి అనేది ప్రహసనంగా, పేదల నెత్తిన గుదిబండగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా జాగ్రత్త పడాలి. ప్రజలంతా వారంరోజుల్లో తమ నగదుని రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.

దేశాన్ని ప్రేమించే వాళ్ళు, నల్లధనాన్ని, అవినీతిని వ్యతిరేకించే వాళ్ళంతా ఈ పోస్ట్ షేర్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాల్సిందిగా కొరడా.కాం విజ్ఞప్తి చేస్తోంది.

 

Tags : Big loop hole in demonetisationBlack moneyDemonetisationnarendramodi

Also read

Use Facebook to Comment on this Post



Menu