11/8/17 5:14 PM

మోది ఈ ఒక్క పని చేస్తే రియల్ ఎస్టేట్ లో బ్లాక్ మనీ ఫినిష్

black money in real estate

బ్లాక్ మనీ పై బ్రహ్మాస్త్రం, అవినీతిపరులపై సర్జికల్ స్ట్రైక్ అంటూ మోది  చేసిన నోట్లరద్దు ప్రయోగం ఎలాంటి ఫలితాలు సాధించిందో చూస్తున్నాం. మనదేశంలో అక్రమ సంపాదన బాగా ఎక్కువగా పోగుబడింది రియల్ ఎస్టేట్ రంగంలోనే. మార్కెట్ ధరకి, ప్రభుత్వ ధరకి మధ్య ఉండే భారీ తేడా అంతా బ్లాక్ మనీ రూపంలోకి మారుతోంది. పైగా అక్రమార్జన పరులు, తమ అక్రమార్జనని దాచుకునేది ప్రధానంగా భూములు, బంగారం రూపంలోనే. రియల్ ఎస్టేట్ లావాదేవీలని పారదర్శకంగా చేస్తే కానీ దేశంలో అవినీతి కొంతైనా తగ్గుతుంది. భూముల క్రయవిక్రయాలలో అవినీతి, అక్రమార్జన, బ్లాక్ మనీ ని తొలగించడానికి ఒక బ్యాంక్ ఉద్యోగి మాకు పంపిన సూచన ఇది..

ప్రభుత్వం భూ క్రయవిక్రయాల సంస్థని ఏర్పాటు చేయాలి.

 ఎవరైనా తన ఆధీనంలో ఉన్న భూమిని అమ్మాలన్నా, కొనాలన్నా ఈ సంస్థకే అమ్మాలి. ప్రైవేట్ వ్యక్తులకి అమ్మకూడదు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొనకూడదు.

 భూమి గరిష్ట విలువని ఈ సంస్థే నిర్ణయిస్తుంది.

 ఒకే భూమి కొనడం కోసం  ఇద్దరికన్నా ఎక్కువమంది పోటీ పడితే డ్రా ద్వారా ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తారు.

 భూమి కొనుక్కున్నవాళ్ళు ఆ ధరని ప్రభుత్వానికి చెక్ రూపంలో ఇస్తారు.

 భూమి సొంతదారునికి కూడా భూమి విలువని ప్రభుత్వం చెక్ రూపం లోనే చెల్లిస్తుంది.

 ఈ మొత్తం లావాదేవీలు ఆన్ లైన్ లో పారదర్శకంగా జరుగుతాయి.

 ఈ సంస్థలో కూడా అవినీతి జరగకుండా ఉండాలంటే..దీనిలో పనిచేసే అధికారులకి ఎలాంటి విచక్షణాధికారాలు ఉండకూడదు.

 ప్రభుత్వం ఈ అమ్మకాలు కొనుగోళ్ళపై భారీ గా పన్నులు వేయకుండా ప్రస్తుతం ఉన్న స్టాంప్ డ్యూటీ ని బాగా తగ్గించాలి.

 

దీనితో లాభం ఏంటంటే..

 బ్లాక్ మనీ తో భూములు కొనడం ఇక మనదేశంలో సాధ్య పడదు.

  దీనితో అక్రమార్జనపరులు తమ అక్రమ సంపాదనని భూములపై పెట్టబడి పెట్టడం మానేస్తారు.

 భూముల ధరలు విపరీతంగా పెరిగే వీలు ఉండదు కాబట్టి, ఇతరులు కూడా భూముల మీద పెట్టుబడి పెట్టడం మానేస్తారు. ఇతర వ్యాపారాలలో పరిశ్రమలలో పెట్టుబడి పెడతారు.

 భూముల ధరలు కూడా అందరికీ అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు సొంత ఇల్లు అనే కల నేరవేర్చుకోగలుగుతారు.

 ప్రభుత్వం ఏదైనా అవసరాలకోసం భూమి సేకరించాలి అనుకున్నా కూడా  ఈ సంస్థ ద్వారా అప్పుడు ఉన్న ధరకే కొనుగోలు చేస్తుంది.

ఇవీ ఈ పధ్ధతిలో ఉన్న ప్రయోజనాలు.

ప్రజల రోజువారీ జీవనంలో ప్రభుత్వ జోక్యం  వీలయినంత తక్కువ ఉండాలని కొరడా.కాం నమ్ముతోంది. ఈ సూచన ఆ సూత్రానికి విరుద్ధమైనా ఒక చర్చ కోసం దీన్ని పబ్లిష్ చేస్తున్నాము.

 

దీనిపై మీ అభిప్రాయాలని,  దీనిలో ఉన్న నష్టాలని, ఈ పద్ధతిని మెరుగుపరచే  సూచనలని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఒక చర్చ కోసం కొరడా.కాం ప్రచురిస్తున్న ఈ ఆర్టికల్ ను షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Tags : Black moneyBlack Money in Real EstateDemonetisationNotebandireal estate

Also read

Use Facebook to Comment on this Post



Menu