11/9/16 4:13 PM
మోది ఎఫెక్ట్: భారీగా పెరగనున్న బంగారం, భూమి ధరలు

ప్రస్తుతం ఉన్న 500,1000 నోట్లను ఉపసంహరించుకుంటూ నరేంద్రమోది ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగా భవిష్యత్తులో బంగారం, భూముల ధరలు పెరగనున్నాయి. నోట్లు రద్దు చేసినంత మాత్రాన దేశం లో అవినీతి ఒక్కశాతం కూడా తగ్గదు. లంచం తీసుకునే విధానం, వాటిని దాచుకునే పద్ధతులు మారతాయి అంతే. ఇప్పటికే పెద్ద నాయకులు, లంచాల్ని వైట్ లో తీసుకోవడానికి బినామీ కంపెనీలు పెట్టడం, వాటి షేర్స్ అనూహ్యమైన ధరలకి అమ్ముకోవడం (క్విడ్ ప్రొ కో) అనే టెక్నిక్ ఉపయోగిస్తున్నారు. ఇక నుంచి చిన్న నాయకులూ, ప్రభుత్వ ఉద్యోగులు తాము తీసుకునే లంచాల్ని క్యాష్ రూపంలో కాకుండా, బంగారం, భూముల రూపంలో దాచుకుంటారు. దానితో భూముల విలువ అసాధారణంగా పెరుగుతుంది. ప్రభుత్వం కూడా తన ఆదాయం పెంచుకోవడం కోసం భూముల ధరలని పెంచుతుంది. లంచాల డబ్బుతో భూమి కొనుక్కునేవారికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించడం కష్టం కాదు, జీతం తో బతికేవారికి ఇది చాలా భారం అవుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల నల్ల డబ్బు చెలామణి ఆగిపోయి తాత్కాలికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నా, భవిష్యత్తులో మాత్రం భూముల ధరలకి రెక్కలు రావడం ఖాయం. ఇక బంగారం కూడా ఇప్పుడు భారీగా పెరగనుంది.
Tags : Black moneyBlack Money: Real estate and gold prices will raisecorruptiongold pricesnarendra modireal estate