08/13/16 12:13 AM

జనతా గ్యారేజ్ ట్రైలర్ రివ్యూ

janathagarage trailer review

ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న జనతాగ్యారేజ్ ఇంకొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ఆడియోతో పాటు రిలీజ్ అయిన ట్రైలర్, సినిమా మీద అంచనాలని పెంచేసింది. హ్యాట్రిక్ ఊపులో ఉన్న కొరటాలశివ ఆ ఫీట్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మొక్కల్ని ప్రేమించే ఆనంద్ గా ఎన్టీఆర్, మనుషుల్ని ప్రేమించి,వాళ్ళకే కష్టం వచ్చినా తన కళ్ళలో నీళ్ళుతిరిగే పాత్రలో మోహన్ లాల్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కొరటాలశివ, ఈ సినిమా ద్వారా తాను ఏం చెప్పబోతున్నది, సినిమా ఎలా ఉండబోతున్నది స్పష్టంగా ట్రైలర్ లో హింట్ ఇచ్చాడు. సగం స్టోరీ లైన్ ను ట్రైలర్ లోనే రివీల్ చేయడం ద్వారా, ప్రేక్షకులు ముందే సినిమాకి ట్యూన్ అయిపోతారు. సినిమా మీద ఒక అంచనా కి వచ్చేస్తారని కొరటాలశివ నమ్మకం. అందుకే సినిమా ట్రైలర్ ద్వారా క్యూరియాసిటీ పెంచడం కాకుండా, స్టోరీ లైన్ దాచిపెట్టకుండా స్ట్రైట్ గా నా సినిమా ఇది, నా హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని రివీల్ చేసాడు. శివ తన ముందు సినిమాల్లానే దీనిలో కూడా హీరోని ఒక సోషల్ కాజ్ కి కనెక్ట్ చేసి చూపించాడు. పర్యావరణ కార్యకర్తగా ఉన్న ఎన్టీఆర్, బలహీనులకి అండగా ఉండే జనతా గ్యారేజ్ లో ఎలాంటి రిపేర్లు చేసాడో చూడాలి అంటే సెప్టెంబర్ 2 దాకా ఆగాలి. మొత్తానికి ట్రైలర్ లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ ఒక్కటే మిస్ అయినట్లు కనిపిస్తోంది. అది కూడా సినిమాలై కచ్చితంగా ఉండే ఉంటుంది. మొత్తానికి ట్రైలర్ ని చూస్తుంటే, కొరటాల శివకే కాదు ఎన్టీఆర్ కూడా హ్యాట్రిక్ గ్యారెంటీ అని అనిపిస్తోంది.

 

Janata Garage Trailer ను మీరు కూడా ఇక్కడ చూసెయ్యండి

Tags : Janathagarage trailer talkkoratala shivantrTrailer Review

Also read

Use Facebook to Comment on this Post



Menu