10/23/17 6:03 PM

ఈ ఛాలెంజ్ మీ జీవితాన్ని మార్చేస్తుంది..గెట్ రెడీ

one year challenge

ఐస్ బకెట్ ఛాలెంజ్ చూసాం, ఆ స్ఫూర్తితో రైస్ బకెట్ ఛాలెంజ్ చూసాం..ఇంకా రకరకల ఛాలెంజ్ లు వస్తున్నాయి..ఇప్పుడు మీరు చదవబోయే ఛాలెంజ్ మాత్రం మీ జీవితాన్నిమార్చేస్తుంది. మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇది సహాయపడుతుంది. మీలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మీలో క్రమశిక్షణ పెంచుతుంది. మీలో పట్టుదలని పెంచుతుంది..మీ బలహీనతలని అధిగమించేలా చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలి అంటే దీన్ని మించిన ఛాలెంజ్ లేదు. ఇంతకీ ఈ ఛాలెంజ్ ఏంటంటే..

 

ఈ ఛాలెంజ్ పేరు:

one year challenge, అంటే ఒక ఏడాది పాటు సాగే ఛాలెంజ్ ఇది. #OYChallenge

ఈ ఛాలెంజ్ ఎందుకోసం ?

మనలో చాలామంది రోజూ జిమ్ కి వెళ్లి ఫిట్ నెస్ పెంచుకోవాలనుకుంటారు. కానీ కొన్ని రోజులు వెళ్ళగానే బద్ధకించి మానేస్తారు.  ఇంగ్లీష్ అద్భుతంగా నేర్చుకుని మంచి ఉద్యోగం సాధించాలని కలలుకంటారు, కానీ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయగానే బోర్ కొట్టి మానేస్తారు. ఇలా ఎన్నో కోరికలు నేరవేర్చుకోవాలని, పనులు చేయాలనీ, అలవాట్లు మార్చుకోవాలని అనుకుంటుంటాం..ఇలా అనుకుంటూనే ఉంటాం. ఈ ఛాలెంజ్ తీసుకుంటే ఇక ఇలా అనుకోవడాలు ఉండవు..సాధించడం, పాటించడమే ఉంటాయి. బద్ధకం ఉండదు, బాధ్యత ఉంటుంది. నీరసం ఉండదు ఉత్సాహమే ఉంటుంది. నిరాశ ఉండదు ఆత్మవిశ్వాసమే ఉంటుంది.

ఈ ఛాలెంజ్ లో ఏం చెయ్యాలి?

ఒక్క ఏడాదిలో మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్నో, మార్చుకోవానుకున్న అలావాటో ఏదో ఒకటి ఫిక్స్ చేసుకోవాలి. ఆ లక్ష్యం సాధించడానికి ప్రతిరోజూ(  శని ఆదివారాలు, సెలవు రోజులు, పండగలు పబ్బాలు, పబ్బులు ఏమున్నా సరే) అంటే వరుసగా 365 రోజులు ఏం చేస్తారో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకి రోజూ ఒక గంట జిమ్ చేస్తాను, రోజూ ముప్పై ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటాను,  నెగటివ్ ఆలోచనలు మార్చుకోవడానికి రోజూ కనీసం ఒక్కర్నైనా మెచ్చుకుంటాను, ఇలా ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి. నియమం పెట్టుకోండి. ఆరోగ్యం బాగాలేకపోయినా(డాక్టర్లు వద్దు అని చెబితే తప్ప), వానొచ్చినా, వరదొచ్చినా, డబ్బున్నా లేకపోయినా, శుభ అశుభ కార్యాలు ఎన్నున్నా ఆ నియమం నుంచి వెనక్కి తగ్గకూడదు.

ఈ ఛాలెంజ్ తో ఏమొస్తుంది?

ఒక ఏడాది ఇలా చేస్తే మనలో అద్భుతమైన క్రమశిక్షణ పెరుగుతుంది. ఏదైనా సాధించగలం అనే నమ్మకం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోగలం అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ జీవితంలోనే కాదు సమాజంలో మీరో హీరోగా మిగులుతారు.

ఈ ఛాలెంజ్ ఎవరు మొదలుపెట్టారు?

తెలుగు ప్రజలలో కంప్యూటర్ గురించి అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన పేరు నల్లమోతు శ్రీధర్.  టెక్ గురు గా గత 20 ఏళ్లుగా తెలుగు ప్రజలకి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్న నల్లమోతు శ్రీధర్ ఈ ఛాలెంజ్ మొదలుపెడుతున్నారు. గత ఏడాది ఇదే రోజున, ప్రతి రోజూ టెక్నాలజీ కి సంబంధించిన ఒక్క వీడియో అయినా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీధర్, ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఈ ఏడాదిలో మొత్తం 365 టెక్నికల్ వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. ఈ ఏడాదిలో ఆయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్లారు; దాదాపు రిలీజ్ అయిన ప్రతి సినిమా చూసారు; ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళారు; హాలిడే ట్రిప్స్ కి వెళ్ళారు; ఒకసారి వైరల్ ఫీవర్ తో, మరోసారి షటిల్ ఆడుతూ కాలి లిగమెంట్ గాయంతో ఇంటికే పరిమితం అయ్యారు; అయినా ఆయన నియమం తప్పలేదు. ఈ మధ్య గోవా వెళుతూ, కారు మధ్యలో రోడ్డు పక్కన ఆపుకుని ఒక టెక్నికల్  వీడియో తీసుకుని షూట్ చేసి అప్ లోడ్ చేసారు. అదీ ఆయన కమిట్మెంట్.  అలాంటి వ్యక్తి ఆలోచన నుంచి పుట్టింది ఈ one year challenge.  ఒక ఏడాది పాటు ఆయన ఆచరించి చూపిన మార్గాన్నే ఒక ఛాలెంజ్ గా మనముందు ఉంచుతున్నారు.

ఈ ఛాలెంజ్ లో ఎలా పాల్గొనాలి?

ఒక రోజంతా సీరియస్ ఆలోచించి వచ్చే అక్టోబర్ 24 నాటికి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో, అందుకోసం ప్రతి రోజూ మీరు ఏం చేయగలరో ఒక నిర్ణయానికి రండి. మీ లక్ష్యాన్ని ప్రతి రోజూ గుర్తు చేసేలా మీ మొబైల్ లో గూగుల్ క్యాలండర్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అలారం లాంటిది పెట్టుకోండి. మీరు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్లు నల్లమోతు శ్రీధర్ గారికి మెయిల్ చేయండి. sridharcera@gmail.com అనే ఐడికి మీ పేరు, Facebook ID, ఫోన్ నెంబర్, ఊరు ఇతర వివరాలు పంపండి. Mail Subjectలో OYChallenge అనే పదం రాయండి. వీలువెంబడి మోటివేషనల్ స్టోరీస్, మెసేజెస్, వీలైతే గెట్-టు-గెదర్‌లు ప్లాన్ చెయ్యడం జరుగుతుంది. మీ ఛాలెంజ్ విషయాన్నిమీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి.  మీ ఛాలెంజ్ ని నిజాయితీగా పాటించండి. అబద్ధాలు చెప్పినా, గొప్పలు చెప్పుకున్నా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు, కాకపోతే అది మీకే నష్టం .

మధ్యలో నీరసం వచ్చేస్తే..?

ఇది మనలో చాలామందికి ఉండే సమస్యే, అందుకే కదా ఈ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో పాల్గొంటున్నవారికి మోటివేషన్ కోసం మంచి కథలు, ఆర్టికిల్స్ ఈమెయిల్ ద్వారా అందుతాయి. మూడు నెలలకోసారి గెట్ టు గెదర్ మీటింగ్స్ ఉంటాయి. ఛాలెంజ్ ని విజయవంతంగా పూర్తిచేసినవారి విజయగాధలని  పుస్తకం రూపంలో తీసుకురావడం జరుగుతుంది.

సో గెట్ రెడీ..మీ జీవితం లో ఒక గొప్ప మార్పు కోసం, మీరు విజేతలుగా నిలవడం కోసం ఈ ఛాలెంజ్ తీసుకోండి. అక్టోబర్ 24, 2018 నాటికి మీ జీవితంలో అద్భుతమార్పుని  మీరే గమనిస్తారు, గర్విస్తారు.   

 

Tags : a challenge to change our own lifeComputer ErainspirationmotivationNallamothu SridharOYChallenge

Also read

Use Facebook to Comment on this PostMenu