05/27/17 1:20 PM

ఎటు పోతున్నాం..? తల్లిదండ్రుల బెడ్ రూమ్ లో సీక్రెట్ కెమేరా పెట్టిన 13 ఏళ్ల కొడుకు..

ADDICTION TO SOCIAL MEDIA

అతి చవక గా దొరుకుతున్న స్మార్ట్ ఫోన్స్, అంతకన్నా చీప్ గా దొరుకుతున్న నెట్ కనెక్టివిటి సమాజాన్ని ఎంతగా పతనం చేస్తున్నాయో తెలిపి మరో ఘోర ఉదాహరణ ఇది.

బెంగళూరు లో ఉండే 13 ఏళ్ల పిల్లాడికి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఫేస్ బుక్ లో ఎకౌంట్ తెరిచిన అ పిల్లాడికి  తేజస్ పటేల్ అనే వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. తరచూ తేజస్ పటేల్ ఈ పిల్లాడికి ఫేస్ బుక్ లో అశ్లీల వీడియో లు పంపేవాడు. ఆ పిల్లాడు క్రమేణా ఈ అశ్లీల వీడియోలకి బానిసయ్యాడు. ఈ పిల్లాడి బలహీనతని పసిగట్టిన తేజస్ పటేల్, ఆ పిల్లాడిని నీ తలిదండ్రులు బెడ్ రూమ్ లో ఉండగా దాన్ని సీక్రెట్ గా వీడియో తీసి పంపమని అడిగాడు. ఆ పిల్లాడు సీక్రెట్ కెమెరా తో తన తల్లిదండ్రుల ఏకాంత దృశ్యాలని వీడియో తీసి తేజస్ పటేల్ కు పంపించాడు. తనకి డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలని పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తానని తేజస్ పటేల్ ఆ పిల్లాడి తల్లిందండ్రులని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు.  దీనితో ఆ తల్లిదండ్రులు పోలీసులని ఆశ్రయించారు.  ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు మన ఇంట్లో జరగకూడదు అంటే..

 

♦ పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ కొనివ్వకండి(వీలయినంతవరకు). బేసిక్ ఫోన్స్ మాత్రమె ఇవ్వండి.

♦ పిల్లలకి లాప్ టాప్, టాబ్లెట్స్ కన్నా డెస్క్ టాప్ కొనివ్వడం మంచిది. ఆ డెస్క్ టాప్ ని కూడా స్క్రీన్ అందరికీ కనిపించేలా హాల్ లో పెట్టడం మంచిది.

♦ ఇంట్లో వైఫై ఉంటే ఆ పాస్ వర్డ్ పిల్లలకి చెప్పవద్దు. పిల్లల బెడ్ రూమ్ లో పొరపాటున కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వద్దు.

♦ పిల్లలు పడుకునే ముందు వాళ్ళ ఫోన్స్ మీరు తీసేసుకుని, తెల్లవారిన తర్వాత తిరిగి ఇవ్వండి. లేదంటే వాళ్ళు రాత్రుళ్ళు నిద్రపోకుండా ఫోన్స్ తో కాలక్షేపం చేసే ప్రమాదం ఉంది.

♦ పిల్లలకి పుస్తకాలు చదవడం అలవాటు చేయండి.

ఈ కనీస జాగ్రత్తలు తీసుకుని మీ పిల్లలు తప్పుదారిపట్టకుండా చూసుకోండి.

టెక్నాలజీ అనేది కత్తి లాంటిది, దానితో కాయలూ కోయచ్చు,తలకాయలూ కోయోచ్చు. ఏది కొయ్యాలనే విచక్షణ పిల్లలలో కలిగేవరకు మనమే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

 

Tags : Addiction to Social MediafacebookPorn Clips

Also read

Use Facebook to Comment on this Post



Menu