10/3/17 3:18 PM

జియో యూజర్లకి మరో షాక్ ఇవ్వనున్న అంబాని

mukesh ambani JIO

జస్ట్ 15వందలు కడితే చాలు స్మార్ట్ ఫోన్ ఫ్రీ, మూడేళ్ళు ఆ ఫోన్ వాడేసుకుని ఆ తర్వాత ఫోన్ తిరిగి ఇస్తే మన డబ్బులు మనకి తిరిగి ఇస్తారు ఎంత గొప్ప ఆఫరో అని మురిసిపోయిన వినియోగదారులకి, ఏడాదికి 1500 రూపాయలకి రీఛార్జ్ తప్పనిసరి అని  షాక్ ఇవ్వనున్న జియో, మరో షాక్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయిందట. అదేమిటంటే..జియో వచ్చిన కొత్తలో అన్నీ అన్ లిమిటెడ్ గా ఫ్రీ అని చెప్పారు. దానితో వినియోగదారులు ఎగబడిపోయారు. మనవాళ్ళ వాడకం దెబ్బకి రోజుకి 1 GB డేటా మాత్రమే ఫ్రీ అని కంట్రోల్ పెట్టాల్సివచ్చింది. ఇక ఇప్పుడు వాయిస్ కాల్స్ వంతు వచ్చింది.   అన్ లిమిటెడ్ గా ఫ్రీ అనేటప్పటికి కొందరు రోజుకి ఏకంగా 10 గంటలు ఫోన్ లో మాట్లాడేస్తున్నారట. రోజుకి 24 గంటల్లో 6 గంటలు నిద్రపోతే మిగిలిన 18 గంటల్లో 10 గంటలు ఫోన్ తోనే గడిపేస్తున్నారట. ఈ వాయిస్ కాల్స్ కూడా జియో కి భారంగా మారడం తో ఇప్పుడు అన్ లిమిటెడ్ ఫ్రీ  నుంచి రోజుకి 300 నిమిషాలు అంటే 5 గంటలే ఫ్రీ టాక్ టైం అని మార్చబోతున్నారట.  అయితే ఈ కంట్రోల్స్, రేషనింగ్ అనేవి ముఖేష్ అంబానీ మదిలో ఎప్పటినుంచో ఉన్నాయట.  అన్ లిమిటెడ్ ఫ్రీ అనగానే జనం ఎగబడి కొనేస్తారని, ఒకసారి మార్కెట్ ని కబ్జా చేసాక ఇలాంటి కండిషన్స్ పెట్టవచ్చని ముఖేష్ ఆలోచించారట. ముఖేష్ అనుకున్నట్లే మార్కెట్ ని జియో కబ్జా చేసేసింది. ఇప్పుడు క్రమేణా ఒక్కొక  కండిషన్ ని లీక్ చేస్తున్నారు. ప్రజలు ఈ లీక్ లకి అలవాటుపడిపోయాక జియో అసలు ప్లాన్ బయటపడుతుంది.

 

 

Tags : Ambanianother restriction from JIOdataRelianceTALK TIMEUNLIMITED

Also read

Use Facebook to Comment on this Post



Menu