01/26/18 8:55 AM

భాగమతి రివ్యూ అండ్ రేటింగ్

bhagamathi review and rating

నటీనటులు: అనుష్క షెట్టి, జయరాం, ఉన్ని ముకుందన్, జయరాం, ఆశా శరత్, నాగినీడు, ధనరాజ్, మురళి శర్మ, విద్యుల్లేఖా రామన్, ప్రభాస్ శ్రీను.
సినిమాటోగ్రఫి : R. మధి
ఎడిటింగ్ : కోటగిరి వేంకటేశ్వర రావు.
కథ, కధనం, దర్శకత్వం: G. అశోక్.
సంగీతం S. S. తమన్
ఆర్ట్ : రవీందర్
నిర్మాత :UV క్రియేషన్స్
విడుదల : జనవరి 26 2018

 

కథ:

ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించిన సెంట్రల్ మినిస్టర్ (మలయాళం పాపులర్ యాక్టర్ “జయరాం”),అంటే హై కమాండ్ కి మంట. CM పోస్ట్ కి ఎక్కడ ఎసరు పెడతాడో అని భావించి హై కమాండ్, అతన్నిఎదో ఒక స్కాం లో ఇరికించే పని సిబిఐ ఆఫీసర్ (ఆశా శరత్) కి అప్పగిస్తుంది. సిబిఐ ఆఫీసర్ సెంట్రల్ మినిస్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీ గా పని చేసిన IAS ఆఫీసర్ చంచల (అనుష్క ని, సీక్రెట్ గా ఇంటరాగేట్ చేయాలని ప్లాన్ వేస్తుంది. కాని చంచల, తన ప్రియుడు శక్తి (ఉన్ని ముకుందన్) ని చంపిన కేసు లో జైలు లో వుంటుంది. కనుక, ఎవరికీ తెలియకుండా చంచల ని ఒక ఓల్డ్ బంగ్లా లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ బంగ్లా లో దెయ్యం వుందని అక్కడి వూరు వాళ్ళు అనుకుంటూ వుంటారు. చంచల కూడా దెయ్యం భారిన పడుతుంది. ఆ దెయ్యం పేరే భాగమతి. భాగమతి కి ఏమి కావాలి.  సిబిఐ ఆఫీసర్ ఇంటరాగేషన్ లో బయట పడిన నిజాలేంటి, చంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపాల్సి వచ్చింది అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన కథ .

 

కథనం, దర్శకత్వం: 

పిల్ల జమిందార్ తరువాత, G. అశోక్ ఈ స్క్రిప్ట్ ఐదేళ్ళు గా రెడీ చేసి అనుష్క గారి కోసం వెయిట్ చేస్తున్నారంటే, ఈ కధ కి అనుష్క అవసరం ఎంత వుందో ఇట్లే అర్ధమవుతుంది. ఈ సినిమా కధ చాలా సింపుల్ గా అనిపించినా కూడా, మంచి కథనం తో సస్పెన్స్ ని చివరి వరకు నిలబెట్టి డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమా కధనం కొంచెం చంద్రముఖి, కొంచెం అరుంధతి, కొంచెం ప్రస్థానం చాయలు కనిపిస్తాయి. కాని కథ లో వాటితో అసలు పొంతన లేనందున ప్రేక్షకుడు మంచి సినిమా చూసిన ఫీల్ తో బయటకి వస్తాడు. చంచల, శక్తీ ల ఫ్లాష్ బ్యాక్ కొంచెం కొంచెం రివీల్ చెయ్యడం బాగుంది. విలన్ ఎవరో లాస్ట్ 5 మినిట్స్ వరకు దాచడం, కథనంలో డైరెక్టర్ పనితనం కనిపించింది.

 

నటన :

చంచల గా అనుష్క నటన చాల చక్కగా ఉంది. భాగమతి క్యారెక్టర్ ఐదు నిమిషాల కంటే ఎక్కువ వుండదు. అది ఇంకొచెం ఎక్కువ సేపు చేసి వుంటే ఇంకా బాగా వుండేది. దెయ్యం పట్టినప్పుడు నటించే సీన్స్ అద్భుతం గా చేసింది. కొన్ని సీన్స్ లో  తన వయసు, లావు కొంచెం అడ్డు అయినట్లు గా అనిపిస్తుంది.
సుబ్బారెడ్డి గా ప్రభాస్ శ్రీను, లింగమూర్తి గా ధనరాజ్ కధ కు న్యాయం చేసారు కాని, కామెడి సన్నివేశాలు లేనందున వాళ్ళు తేలిపోయారు. అనుష్క తరువాత, ఇంకో పవర్ ఫుల్ క్యారెక్టర్ IPS ఆఫీసర్ గా చేసిన ఆశా శరత్. జయరాం సెంట్రల్ మినిస్టర్ గా ఈ సినిమా లో చక్కగా చేసారు, కాని తెలుగు వారికి ఎక్కువ పరిచయం లేనందున, అంత గా ఇంపాక్ట్ కలగలేదు. శక్తి గా చేసిన ఉన్ని ముకుందన్ కూడా పరవాలేదు, కాని తెలిసిన హీరో అయితే, సినిమా కి ఇంకా ప్లస్ అయ్యేది.

 

మిగిలిన డిపార్ట్మెంట్స్:

 

ఈ సినిమా కి ఐదు వందల ఏళ్ల బంగ్లా సెట్ నిజం గా ఒక పెద్ద అసెట్. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పడిన కష్టం మూవీ లో క్లియర్ గా కనిపిస్తుంది. అంత పాత బంగ్లా ఫీల్ తీసుకురావడం, రియలిస్టిక్ గా చూపించడం సినిమా కథ కి చాలా అవసరం.
సినిమాటోగ్రఫి R. మాధి ఈ సినిమా చాల చక్కగా తెరకి ఎక్కించారు. ఇంతకు ముందు శ్రీమంతుడు, మిర్చి లాంటి పెద్ద సినిమాలకి మధి పనితనం చూసాం. ఈ మూవీ మధి కెరీర్ లో గుర్తు వుండి పోయే సినిమా.

 

S.S. తమన్ సంగీతం ఇంకొక మేజర్ ప్లస్. ఇలాంటి థ్రిల్లర్ మరియు సస్పెన్స్ మూవీ కి సంగీతం చాలా కీలకం. ఇంతకు ముందు రాజు గారి గది 2 కి తమన్ వర్క్ మనం ఆల్రెడీ చూసాం. కాని ఇలాంటి మూవీ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో క్యురీయాసిటి క్రియేట్ చెయ్యాలి. తమన్ ఈ విషయం లో బాగా మార్కులు సంపాదించాడని చెప్పొచ్చు.

 

UV క్రియేషన్స్ ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా వున్నాయి. ప్రొడక్షన్ కాస్ట్ అంతా బిల్డింగ్ సెట్ మీదే ఉంది. కథనం లో ఇంకొన్ని మైనర్ చేంజెస్ చేస్తే మూవీ ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. ఉదాహరణకి : చంచలకి కూడా విలన్ ఎవరో క్లైమాక్స్ వరకు తెలియకుండా వుంచడం. భాగమతి సీన్ ఒక్కసారి కంటే ఎక్కువ ప్లాన్ చెయ్యడం. చంచల చేతిలో శీల కొట్టుకోవడం అనేది పోలీస్ ఆఫీసర్ (మురళి శర్మ), IAS ఆఫీసర్ కి చెప్పినట్లు చూపడం
ధనరాజ్, ప్రభాస్ శ్రీను కి కామెడి సీన్స్ యాడ్ చెయ్యడం లాంటివి.

 

ఒక్కమాటలో చెప్పాలి అంటే..: హిట్టు సినిమా 

రేటింగ్: ౩.25/5

Review by: Ajith (From Detroit, MI. USA)

Tags : Anushka ShettyBhagamathi movieBHAGAMATHI REVIEW AND RATINGBhagamatiG.ASHOKU V Creations

Also read

Use Facebook to Comment on this PostMenu