10/4/17 2:17 PM

ఉద్యోగాలు ఉన్నాయ్..చేసే మనుషులు కావాలి

JOBS IN INDIA

ఏదైనా గ్రామంలోకి వెళ్లి ఒక రైతుని మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏమిటని అడగండి. వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదు అంటారు. పట్టణంలోకి వెళ్లి ఒక హోటల్ యజమానిని అడగండి. కుక్స్, వెయిటర్స్, ఫ్రంట్ ఆఫీస్ పనులు చేయడానికి సరైన వ్యక్తులు దొరకడం లేదు అంటారు…

 

“అసలు ఈశాన్య భారతదేశం వారు ఉండబట్టి సరిపోయింది. లేకపొతే పెద్ద క్రైసిస్ వచ్చివుండేది” అని కేరళ లో ఒక హోటల్ యజమాని అంటున్నాడు. భవన నిర్మాణ దారుణ్ని అడగండి ప్లంబర్లు, ఫిట్టర్లు మొదలైన వారు దొరకడం లేదు అంటారు. మారిషస్ వాళ్ళకు అక్కడ పురోహితుడు, కుక్ కావాలి దొరకడం లేదు సాయం చెయ్యండి అని వారు అడుగుతున్నారు..

 

ఒక పక్క దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా వుంది అంటున్నారు. మరోపక్క అన్ని రంగాల్లో సరైన నైపుణ్యం ఉన్న వ్యక్తులు దొరకడంలేదు అని ఆయా రంగాల్లో నిపుణులు చెబుతున్నారు. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి…?

 

హోటల్స్ లో దోశ మాస్టర్ కు ఇరవై ముప్పై వేలు ప్రారంభ జీతం వుంది. అదే ఇంజనీర్ లు పది వేల జీతానికి కూడా క్యు లో నిల్చుంటున్నారు… సమస్య ఎక్కడ వుంది అంటే అందరికి వైట్ కాలర్ జాబ్ లే కావాలి. జీతం ఎక్కువ వస్తుంది అని కాదు. చాలా సెమి స్కిల్ల్డ్ జాబ్స్ కు ఐదంకెల  జీతం వస్తుంది. ఈరోజు ప్రభుత్వ టీచర్ ప్రారంభ జీతం దాదాపు 50 వేలు. అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్ { సర్జన్} జీతం నలభై వేలు. మన వారు ఒక్కో జాబ్ కు ఒక్కో సోషల్ స్టేటస్ అంటగట్టేసారు. ఇంజనీర్, డాక్టర్ అంటే గొప్ప అని టీచర్ అంటే ఏదో పనికి రాని జాబ్ అని ఇలా ముద్ర వేస్తారు.  ప్లంబర్, ఫిట్టర్ లాంటి పనులు చేస్తున్నాను అంటే అమ్మాయి కూడా దొరకని పరిస్థితి. అంతెందుకు పౌరోహిత్యం చేసే వారికి విదేశాల్లో చాలా డిమాండ్ వుంది. అయినా పురోహితుడు అంటే పెళ్ళికి అమ్మాయిలు ముందుకు రాని స్థితి. కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పుకొంటూ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వక పోయినా కేవలం ప్రెస్టేజ్ కోసం పని చేసేవారు వున్నారు. అదే హోటల్ లో కుక్ గా వెయిటర్ గా చెయ్యమంటే నామోషీ. తలతీసినట్టు ఫీల్ అవుతారు. ఇదే మనవారు అమెరికాకు వెళితే అక్కడ హోటల్ లో పనిచెయ్యడానికి సిద్ధపడతారు…

 

అంటే ఇక్కడ మారాల్సింది మనక దృక్పధం. దొంగతనం, అడుక్కోవడం తప్ప ఏ పని చేసినా తప్పులేదు. అన్ని పనులు గొప్పవే. మీ మనసుకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకోండి. అతిచిన్న ఉద్యోగమైనా పరవాలేదు. చేతినిండా పని ఉండాలి, ఎంతో కొంత ఆదాయం ఉండాలి. చేస్తున్న పనిపై మనసు లగ్నం చెయ్యాలి. అంచెలంచెలుగా ఎదగాలి. పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి. పాన్ డబ్బా పెట్టుకొన్నా పరవా లేదు. కర్రీ పాయింట్ పెట్టుకున్నా పరవా లేదు…”మీరే రాజు… మీరే మంత్రి…”

 

డిప్రెషన్ వద్దే వద్దు. ఆత్మ విశ్వాసం, కృషి, పట్టుదల, మారిన పరిస్థితులకు అనుగుణంగా మారడం ఇవి ఉంటె చాలు బోలెడు ఉద్యోగాలు వ్యాపారాలు మీకోసం రెడీ గా ఉన్నాయి.

– శివకుమార్ మకుటం

Tags : best openingsEMPLOYMENT IN INDIAjobsOPENINGSOPPORTUNITIESunemploymentVACANCIESyouth

Also read

Use Facebook to Comment on this PostMenu