01/12/18 11:56 AM

జై సింహా సినిమా రివ్యూ అండ్ రేటింగ్

jai simha review

నందమూరి బాలకృష్ణ కీ సంక్రాంతి పండగ కీ ఉన్న అవినాభావ సంబంధం స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన కెరీర్ లో తోపు సినిమాలు , బ్లాక్ బస్టర్ లు అన్నీ ఇదే టైం కి విడుదల చేసారు మరి. హీరోగా ఆయన ప్రస్థానం మొదలైన తరవాత ఎక్కువ హిట్ సినిమాలు ఇచ్చింది కూడా ఈ కాలం లోనే. మొత్తం మీద బాలయ్య సంక్రాంతి పుంజు అంటూ ఉంటారు. అయితే ఈ సంక్రాంతి కి జై సింహ పుంజు ఎంత వరకూ రాణించింది అనేది చూద్దాం రండి ..

 

కథ – విశ్లేషణ – పాజిటివ్ లు :

 

హీరో నరసింహ  తన ఆరు నెలల బిడ్డ తో సౌత్ ఇండియా లో అనేక ప్రాంతాలలో తిరగడం తో సినిమా మొదలవుతుంది .. చివరగా కుంభకోణం అనే ప్రాంతం లో ఆ ఏరియా ధర్మాధికారి ఇంట్లో పనోడిగా సెటిల్ అవుతాడు నరసింహ. తన బిడ్డే ప్రాణం గా బతికే నరసింహ కి ఆ ఇంటివారి మీద కూడా మమకారం పెరుగుతుంది. మురళీ మోహన్ కూతురు చేసిన తప్పుని , యాక్సిడెంట్ ని తన నెత్తి మీద వేసుకుని తన్నులు కూడా తింటాడు హీరో. ఈ క్రమం లో ఊర్లో కొత్తగా వచ్చిన ACP బ్రాహ్మణుల మీద చెయ్యి చెసుకున్న సందర్భం లో మురళీ మోహన్ వారికి తోడుగా నిలబడగా పౌరోహిత్యం గొప్పతనం చెప్పి ACP కళ్ళు తెరిపిస్తాడు నరసింహ. నయనతార భర్త అతనే అనే విషయం ఇంటర్వెల్ బ్యాంగ్ లో రివీల్ అవుతుంది. అయితే ఆమె కొడుకు ఇతని కొడుకు ఇద్దరూ ఒకేలాగా కవల పిల్లల లాగా ఉండడం తో కథలో ట్విస్ట్ వచ్చి ఇంటర్వెల్ బ్యాంగ్ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం నయనతార – బాలయ్య ల మధ్యన రిలేషన్ ఏంటి , ప్రకాష్ రాజ్ వీరి ప్రేమని ఎందుకు ఒప్పుకోలేదు , ఇద్దరి పిల్లలూ ఒకేలా ఎందుకు ఉన్నారు అనే అంశాల మీద సాగుతుంది. సినిమా మొత్తానికీ నయనతార , బాలకృష్ణ ల నటన పెద్ద పాజిటివ్ పాయింట్ .. ముఖ్యంగా వారిద్దరి మధ్యనా కెమిస్ట్రీ వర్క్ అయ్యింది . మూడో సారి జంటగా నటిస్తున్న వీరిద్దరూ పోటీ పడి మరీ నటించారు. ఒక బిడ్డకి తల్లిగా, బిడ్డ లాంటి మనసున్న భర్త కి భార్యగా నయనతార మరొక సింహ లాంటి క్యారెక్టర్ తో ఆకట్టుకుంది. బాలయ్య డైలాగుల దగ్గర నుంచీ ఫైట్ ల వరకూ దద్దరిల్లేలా చేసాడు. సినిమా మొత్తం ఆయనే కనపడ్డాడు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల లో,సెంటిమెంట్ సీన్ లలో బాలయ్య నటన ఆకట్టుకుంది . ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్ లూ, ట్విస్ట్ అన్నీ ఇంటరెస్టింగ్ గా అనిపిస్తాయి. కామెడీ కూడా అక్కడక్కడా బాగానే పేలింది. బ్రహ్మానందం కి ఇది మంచి కం బ్యాక్ సినిమా .. హీరో హీరోయిన్ బిడ్డ కి సంబందించిన ఎమోషనల్ సీన్ లు బాగా రాసుకున్నాడు డైరెక్టర్ రవికుమార్. ప్రకాష్ రాజ్ పాత్ర పరవాలేదు ..

 

 

ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్ కథ .. దారుణంగా మరీ పాత కథని ఎత్తుకొచ్చిన డైరెక్టర్ దాన్ని అటు తిప్పి ఇటు తిప్పీ తీసేసాడు. ఆఖరి నలభై నిమిషాలు సినిమా టార్చర్ చూపించాడు డైరెక్టర్. క్లైమాక్స్ ఫైట్ అయితే చాలా బోరింగ్. అప్పటి వరకూ మంచిగా వెళుతున్న కథనం చేడగోట్టేసాడు . ఫ్లాష్ బ్యాక్ స్ట్రాంగ్ గా ఉన్నా లాజిక్ లు మిస్ అవుతూనే ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడి లాంటి స్క్రీన్ ప్లే చూపించాడు డైరెక్టర్ రవి కుమార్.

 

మొత్తంగా చూస్తే ..

 

ఒక ఎనభైల నాటి కథని తీసుకుని దానికి ఫస్ట్ హాఫ్ వరకూ ఆసక్తికర ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్లాష్ బ్యాక్ ఐన సెకండ్ హాఫ్ లో  సినిమాని చంపెసాడు డైరెక్టర్ కే ఎస్ రవికుమార్. హీరో బాలకృష్ణ ఈ సినిమా చూడడానికి ప్రధాన కారణం అని చెప్పచ్చు . వైజాగ్ బీచ్ రోడ్ సీన్ , ఇంటర్వెల్ , సెంటిమెంట్ సీన్స్  , అమ్మ కుట్టి సాంగ్ లో బాలయ్య ని ఫ్యాన్ కానీ వారు కూడా మెచ్చుకుని తీరతారు. కానీ రవికుమార్ స్వయంక్రుత అపరాధం సినిమాని గట్టిగా దెబ్బ తీసింది. సంక్రాంతి మాస్ సీజన్ కావడం తో బాలయ్య ఫాన్స్ కీ బీసీ సెంటర్ లకి ఈ సినిమా సంక్రాంతి వెళ్ళే వరకూ ఏమన్నా ఊరట ఇవ్వచ్చునేమో తప్ప విషయం ఉన్న సినిమా అయితే కానే కాదు. దాదాపు ఇరవై ఏడు కోట్లు వచ్చి బ్రేక్ ఈవెన్ అయితే కానీ ఈ సినిమా హిట్ కానట్టే లెక్క . అయితే అంత సొమ్ము వస్తుందా అంటే  కష్టమే . ఒక ఇరవై ఇరవై మూడు దగ్గర ఆగిపోవచ్చు.

 

ఒక్కమాటలో చెప్పాలి అంటే: ఫ్యాన్స్ కి నచ్చుతుంది, మిగతావారికి ఓకే, నాట్ బాడ్

అంకెల్లో చెప్పాలి అంటే: 3/5

 

Tags : balakrishnaJai Simha Review and RatingNayantara

Also read

Use Facebook to Comment on this PostMenu