06/14/18 4:17 PM

సంచలనం సృష్టించిన చిన్నారి హత్యకేసులో తుది తీర్పు..!

Untitled-1 copy

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుర్ఘటన అది. అందరిని కంటతడి పెట్టించిన ఘోరం అది. కాసుల కోసం మనిషి ఎంతకు దిగజారిపోయాడో తెలిపిన వైనమిది. అదే విజయవాడకు చెందిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసు. ఎనిమిదిన్నరేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన చిన్నారి పలగాని నాగవైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో విజయవాడలోని మహిళా సెషన్స్ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది.

 

2010లో జరిగిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో ముగ్గురు దోషులకు కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులు మోర్ల శ్రీనివాసరావు ఏ-1, యంపరాల జగదీశ్‌ ఏ-2, వెంకటరావుగౌడ్‌ ఏ-3 లకు న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. కిడ్నాప్, మర్డర్ నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. అయితే ఈ తీర్పుపై నిందితులు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

 

న్యాయస్థానం తీర్పు పట్ల నాగవైష్ణవి బంధువులు, విద్యార్థి, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తీర్పు కోసం ఏకంగా ఎనిమిదిన్నరేళ్లు పట్టడంపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. న్యాయం కోసం పోరాడిన నాగవైష్ణవి తల్లి నర్మదాదేవి గతేడాది మృతిచెందారని.. ఆమె బతికుండగానే తీర్పు వస్తే ఆ కుటుంబానికి స్వాంతన కలిగేదని పలువురు వాపోయారు.

 

మద్యం వ్యాపారి ప్రభాకర్ నర్మద అనే యువతిని రెండో వివాహం చేసుకోగా, వారికి సాయితేజేష్, నాగవైష్ణవి ఇద్దరు సంతానం కలిగారు. ఆయన మొదటి భార్య వెంకటరామమ్మ సోదరుడు వెంకటరావు (ఏ-3).. వైష్ణవి పేరుపై ప్రభాకర్‌ ఆస్తులు ఉన్నాయని తెలుసుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. శ్రీనివాసరావు, జగదీశ్‌లతో కలిసి పథకం పన్ని ఆ చిన్నారిని దారుణంగా చంపేశారు.

 

2010 జవనరి 30న కారులో స్కూల్ కు వెళ్తున్న చిన్నారి నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఇనుము కరిగించే బాయిలర్‌ లో వేసి దహనం చేశారు. నాగవైష్ణవిని చంపకుండా అడ్డువచ్చిన డ్రైవర్ లక్ష్మణ రావును కూడా చంపేశారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. నాగవైష్ణవి మృతి తెలిసి తండ్రి పలగాని ప్రభాకర్ మనో వేధనతో మృతి చెందారు. ఈ హత్య, మృతి పట్ల కంటతడి పెట్టని వారు లేరు.

 

మద్యం వ్యాపారి పలగాని ప్రభాకర్‌ తన అక్క కూతురు వెంకటరామమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి దుర్గాప్రసాద్‌ అనే కుమారుడు ఉన్నాడు. కొన్నాళ్లకు ప్రభాకర్‌ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నర్మదను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు సాయితేజష్‌, నాగవైష్టవి సంతానం. పాప వైష్టవి పుట్టిన తరువాతే తన దశ తిరిగిందన్నది ప్రభాకర్‌ నమ్మకం. గారాలపట్టి వైష్టవి పేరుతో ఆస్తులన్నీ పెడుతున్నాడన్న భావన మొదటి భార్య సోదరుడు వెంకటరావులో బలంగా ఏర్పడింది. దీంతో వైష్ణవిని చంపాలని నిర్ణయించుకున్న వెంకటరావు, తన చిన్నమ్మ కొడుకు శ్రీనివాసరావుతో కోటి రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. జనవరి 30న చిన్నారి వైష్ణవిని కిడ్నాప్‌ చేసి చంపేశారు. తర్వాత ఆమె శవాన్ని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.

Tags : accused life imprisonmentNaga vaishnavi murder caseverdictVijayawada court

Also read

Use Facebook to Comment on this Post



Menu