11/27/15 1:04 PM

అనుష్క “సైజ్ జీరో” రివ్యూ

Size-Zero-Movie-Review

size zero movie review ecg

 

అనుష్క ప్రధానపాత్రలో, కె.ఎస్.ప్రకాశ రావు దర్శకత్వం లో పివిపి సినిమా నిర్మించిన సైజ్ జీరో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ ఖర్చుతో, అనుష్క భారీ ఆకారంతో విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉంది అంటే…

 

కథ:

సౌందర్య అలియాస్  స్వీటి (అనుష్క) ఓ అందమైన, లావైన అమ్మాయి. ఆ అమ్మాయి కి చిన్నప్పుడే తండ్రి చనిపోతాడు(రావు రమేష్). తల్లి(ఊర్వశి) డబ్బావేర్(టప్పర్ వేర్ లాంటిది) వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. సౌదర్య తాత(గొల్లపూడి), తమ్ముడు యాహూ(మాస్టర్ భరత్), ఇదీ సౌందర్య ఫామిలీ. లావుగా ఉన్నసౌదర్యకి పెళ్లి చేయడం అనేది తల్లికి పెద్ద సమస్య గా మారుతుంది. డాక్యుమెంటరి ఫిల్మ్స్ తీసే అభి(ఆర్య), సౌందర్య కి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తారు. సౌందర్య ఫ్యామిలికి, అభి ఫ్యామిలి కి ఉన్న కామన్ ఫ్రెండ్ ద్వారా పెళ్లి చూపులు జరుగుతాయి కాని, పెళ్లి జరగదు. అయితే, సౌందర్య చేసే సామాజిక సేవ కారణంగా అభి కి సౌందర్య అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఈ లోపు సిమ్రాన్ (సోనాల్ చౌహాన్) విదేశాల నుండి స్వచ్చంద సేవ చేయడానికి ఇండియాకి వస్తుంది. సన్నగా స్లిమ్ గా ఉండే సిమ్రాన్ కి అభి దగ్గర అవుతాడు. తను లావుగా ఉండడం వల్లే అభి తానకి దూరం అయ్యాడని అనుకున్నసౌందర్య సన్నబడడం కోసం సైజ్ జీరో సత్యానంద్ (ప్రకాష్ రాజ్) కు చెందిన స్లిమ్మింగ్ సెంటర్ లో జాయిన్ అవుతుంది. స్లిమ్మింగ్ సెంటర్ లో పేరుతో సత్యానంద్ అందించే ట్రీట్ మెంట్ వికటించి సౌందర్య స్నేహితురాలికి కిడ్నీ పాడవుతుంది. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాపై సౌందర్య  ఎలా పోరాడింది, సైజ్ జీరో సత్యానంద్ ఆట ఎలా కట్టించింది, అభి సౌందర్యల ప్రేమ కథ ఎలా ముగిసింది అన్నదే మిగతా కథ.

 

ఎలా తీసారు?

 

లావుగా ఉండే అమ్మాయి ఎదుర్కొనేకష్టాలు,పడే ఇబ్బందులు సరదాగానూ చూపించొచ్చు, అయ్యో పాపం అనేలాగా చూపించొచ్చు. లేదా, మొదట సరదాగా, తర్వాత సీరియస్ గా చూపించొచ్చు. ఈ మూడు పద్ధతుల్లో ఎలా చూపించినా ఏదో ఒక వర్గం ప్రేక్షకులకి సినిమా నచ్చుతుంది. దర్శకుడు ప్రకాశ్ మాత్రం నాలుగో రకంగా తీసాడు. అనవసరమైన సామాజిక సేవలు, సందర్భం లేకుండా వచ్చే సూక్తులు, తెలుగు నేటివిటీ దూరమైన దృశ్యాలు, ఒకటికి రెండు లవ్ ట్రాక్  లు అన్నీ మిక్స్ చేసి సినిమా ఎలా తీయకూడదో అలా తీసాడు.  స్క్రీన్ ప్లే ఇంత వీక్ గా ఉన్న తర్వాత , రీళ్ళని బంగారం తో చుట్టినా, అనుష్క కోసం రానా, నాగార్జున, మంచు లక్ష్మి,  హన్సిక, తమన్నాలు రంగంలోకి దిగినా సినిమాని కాపాడలేకపోయారు.

 

కీరవాణి పాటలు బాగున్నాయి, పివిపి నిర్మాణ విలువలు బాగున్నాయి, అనుష్క నటించడానికి స్కోప్ లేదు కాని శరీరాన్ని మాత్రం బాగా కష్టపెట్టింది. సౌందర్య తమ్ముడుగా  భరత్ నవ్వించడానికి ట్రై చేసాడు. ఎప్పటిలాగానే బ్రహ్మానందం క్యారెక్టర్ వేస్ట్ అయింది. పోసాని వల్ల సినిమాకి పైసా ఉపయోగం రాలేదు. ప్రకాష్ రాజ్ కి నటించే స్కోప్ లేదు. అడవి శేషు సినిమాకి అడ్డు అయిపోయాడు. తమిళ మార్కెట్ కోసం చేసిన ప్రయత్నాలు వర్కవుట్ కాలేదు. ప్రవీణ్ పూడి ఎంతో షార్ప్ గా ఎడిట్ చేసాడు కాని, సీన్స్ లో దమ్ములేకపోవడం తో సినిమా చాలా పెద్దగా అనిపిస్తుంది.  రెండు పాటలు, సైకిల్ తొక్కే గేమ్ తప్ప సినిమాలో ఏమీ లేదు.

 

ఫైనల్ గా చెప్పాలంటే: దర్శకుడు మనసు పెట్టి తీసిన సినిమా కాదు, మనసు “ఎక్కడో పెట్టి” తీసిన సినిమా.

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

Tags : anushkaAnushka Shettysize zeroSIZE ZERO MOVIE REVIEWsize zero movie review ecgTELUGU FILM REVIEWSTelugu MovieTELUGU MOVIE REVIEWS

Also read

Use Facebook to Comment on this PostMenu