08/15/18 1:57 PM
గీత గోవిందం మూవీ రివ్యూ!

‘గీత గోవిందం’ మూవీ రివ్యూ
టైటిల్ : గీత గోవిందం
నటీనటులు : విజయ్ దేవరకొండ, రష్మిక మందన, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ, నాగబాబు, అన్నపూర్ణమ్మ, వెన్నల కిషోర్, గిరిబాబు తదితరులు
సంగీతం : గోపీ సుందర్
దర్శకత్వం : పరశురామ్
నిర్మాత : బన్నీ వాస్
బ్యానర్: గీతా ఆర్ట్స్-2
రన్ టైం: 148 నిమిషాలు
యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్న ‘అర్జున్ రెడ్డి’ లాంటి బ్లాక్ బస్టర్ ఫిలిం తర్వాత విజయ్ దేవరకొండ రూట్ మార్చి ‘గీతగోవిందం’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘రౌడీ బాయ్’గా తనకున్న ఇమేజ్ కు పూర్తి భిన్నంగా చేసిన క్యారెక్టర్ లో విజయ్ దేవరకొండ ప్రేక్షకులని ఆకట్టుకున్నాడా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం!
కథ:
విజయ్ గోవింద్ (విజయ్ దేవరకొండ) ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుంటాడు. బాగా సంప్రదాయ భావాలు కలిగిన వాడు. చిన్నప్పటి నుంచి చాగంటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు వింటూ పెరిగిన ఐడియలిస్ట్. తను చేసుకోబోయే అమ్మాయి కూడా అత్యంత సంప్రదాయబద్ధంగా ఉండాలని.. తన అమ్మలాగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అతడు కలలు కంటుంటాడు. ఇదే సమయంలో ఓ అమ్మాయి వెంటపడి.. ఆమె చుట్టూ ఆరు నెలల పాటు తిరిగి.. ఆఖరికి ఆమెకు అప్పటికే పెళ్ళైందని తెలిసి నిరుత్సాపడతాడు. ఇదే సమయంలో గీత (రష్మిక మందన్న) ను ఓ గుడిలో చూసి ఆమెతో ప్రేమలో పడతాడు. ఇదే సమయంలో, తన చెల్లి పెళ్లికి అటెండ్ అవడానికి అతడు కాకినాడకు బస్సులో బయలుదేరతాడు. అనుకోకుండా అదే బస్సులో విజయ్ ప్రక్క సీటులోనే గీత(రష్మిక మందన్న) కూర్చుంటుంది. దీంతో వచ్చిన అవకాశాన్ని వాడుకుని తన ప్రేమ విషయం గీతతో చెప్పడానికి సంసిద్ధడవుతాడు. ఈ నేపథ్యంలోనే తన ప్రెండ్స్ ఇచ్చిన చెత్త సలహాల కారణంగా లవ్ ప్రపోజల్ సీక్వెన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యి.. గీత (రష్మిక) దృష్టిలో ఓ రోగ్‌గా ముద్రపడతాడు విజయ్ గోవిందం . ఆ తర్వాత విజయ్ గీత ప్రేమను ఎలా గెలుచుకున్నాడు. తను ప్రాణంగా ప్రేమించిన గీతతో మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఆఖరులో విజయ్ గోవిందం ఇచ్చిన ట్విస్ట్ ఏంటి అన్నదే ఈ సినిమాలో మిగతా కథ!
నటీనటులుః
అర్జున్ రెడ్డి సినిమాలో తన బోల్డ్ క్యారెక్టరైజేషన్ తో యువ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ.. ఆ పాత్రకు పూర్తి వ్యతిరేకమైన పాత్రను ‘గీత గోవిందం’ సినిమాలో చేశాడు. హీరోయిన్ చుట్టూ ‘మేడమ్.. మేడమ్’ అంటూ తిరిగే ఓ బుద్దిమంతుడి పాత్ర ను చక్కటి డైలాగ్ మాడ్యులేషన్ తో.. ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్‌తో విజయ్ అద్భుతంగా పండించాడు. అలాగే, సినిమా ఆఖర్లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా అభినయించాడు. ఇక హీరోయిన్ రష్మిక గీత పాత్రకు పూర్తి న్యాయం చేసింది. తన పాత్రలో ఉన్న విభిన్న భావోద్వేగాలను సూనాయాసంగా పలికిస్తూ విజయ్ దేవకొండతో పోటాపోటీగా ఆమె నటించింది. ఇక, హీరోయిన్ అన్నయ్యగా సుబ్బరాజు.. హీరో తండ్రిగా నాగబాబు.. హీరో స్నేహితుడిగా.. ‘లవ్ ఎడ్వైజర్’గా రాహుల్ రామకృష్ణ.. ఇతర పాత్రల్లో అన్నపూర్ణమ్మ, గిరిబాబు.. వెన్నల కిషోర్ చక్కగా నటించారు. ఇక, గెస్ట్ రోల్స్ లో నిత్యామీనన్, అనూ ఇమ్మాన్యుయేల్ లు ఈ సినిమాలో మెరిశారు.
సినిమా ఎనాలిసిస్ః
ఫస్ట్ హాఫ్ ను పెద్దగా బోర్ కొట్టించకుండా.. ఎంటర్టైనింగ్ సీన్స్‌తో.. గీత ( రష్మిక మందన) ను గోవిందం (విజయ్) ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే సన్నివేశాలతో దర్శకుడు పరశురామ్ కథను నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అసాంతం రష్మిక-విజయ్‌ల మధ్య కెమిస్ట్రీ హైలెట్‌గా నిలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ సాగదీసినట్లు అనిపిస్తున్న సమయంలో, ప్రేక్షకులకి బాగా రిలీఫ్ కలిగించేలా.. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే వెన్నెల కిషోర్- అన్నపూర్ణమ్మ కామెడీ ఎపిసోడ్ ద్వారా ఈ సినిమాను పరశురామ్ నిలబెట్టాడు. సెకండ్ హాప్లో వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాకు తీసుకున్న ప్లాట్ థ్రెడ్ చాలా చిన్నదే అయినప్పటికీ.. ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తో ప్రేక్షకుల్ని రంజింపచేసేందుకు దర్శకుడు పరశురామ్ ప్రయత్నించాడు. ఈ విషయంలో చాలా మేరకు అతడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్.. అతడి సూపర్బ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆయువుపట్టుగా నిలుస్తాయి. రష్మిక, విజయ్ దేవరొకొండల మధ్య కెమెస్ట్రీ ఈ సినిమాలో పర్‌ఫక్ట్‌గా వర్కవుట్ అయ్యింది. ఇక సినిమాకు మరో మేజర్ ఎస్సెట్ గోపీసుందర్ సంగీతం! ఎక్కడా ఇరికించినట్టు కాకుండా కథానుసారం వచ్చే పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉండగా.. కీలకమైన సినిమాటోగ్రఫీ.. ఎడిటింగ్ లు సినిమాకు తగ్గట్టుగా కుదిరాయి!
ప్లస్ పాయింట్స్ః
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నటన
గోపీసుందర్ సంగీతం
పరుశురామ్ డైలాగ్స్
సెకండ్ హాఫ్‌లో వెన్నల కిషోర్, అన్నపూర్ణమ్మల కామెడీ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్ః
పాత కథ
సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లు ఉండటం
పంచ్ లైన్ః రొటీన్ సినిమానే అయినప్పటికీ, బాగానే ఉంది..
రేటింగ్ః 3.25/5
Tags : geetha ArtsGeetha Govindham movie reviewrashmika mandannavijay devarakonda